కోనరావుపేట, వెలుగు: ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలను ఆయన తనిఖీ చేశారు. స్కూల్, కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్లు, ఇన్‌చార్జీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
టెంపుల్ నిర్మాణానికి కృషి చేస్తా
ఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేటలోని భక్తి సంఘం, శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్స్‌ను త్రిదండి రామానుజ దేవనాథ జియర్ స్వామితో కలిసి సందర్శించారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్ చైర్మన్ రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య, పాల్గొన్నారు.
సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
చందుర్తి, వెలుగు: సనుగుల గ్రామంలో సీసీ రోడ్డు, ముడిపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సనుగులలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫొటోలకు పార్టీ మండల అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.