సిరిసిల్ల: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు, కిస్తీలు కడుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పుచేసిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఆ అప్పులే గుదిబండలా మారయని తెలిపారు. పదేళ్లుగా విధ్వంసమైన ఆర్థిక స్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతుందని చెప్పారు.
ALSO READ | మూసీపై అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం రండి..: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ ఓపెన్ ఆఫర్
అప్పులు తీర్చడంతో పాటు పది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, ఎల్పీజీ సబ్సిడీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, విద్యుత్ సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, ఆర్టీసీ, కళ్యాణలక్ష్మి పథకాలకు భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం శుభసూచకమని, అప్పులను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు.