పదేళ్లలో జరగని అభివృద్ధి పది నెలల్లో చేశాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

పదేళ్లలో జరగని అభివృద్ధి పది నెలల్లో చేశాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు:  పదేళ్లలో బీఆర్‌‌‌‌ఎస్​ప్రభుత్వం చేయని అభివృద్ధి.. పది నెలల్లో చేసి చూపామని ప్రభుత్వ విప్‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌‌‌‌, మెదక్, -నిజామాబాద్-, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలోని  ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి వూట్కూరి నరేందర్‌‌‌‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  సమావేశంలో లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్​ కమిటీ చైర్మన్​ రొండి రాజు, మహేశ్‌‌, శ్రీనివాస్‌‌గౌడ్‌‌, కుమార్‌‌‌‌, ఎల్లయ్య పాల్గొన్నారు. 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ముదిరాజ్‌‌లు ఆర్థికంగా ఎదగాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్​లో గురువారం ముదిరాజ్‌‌ల ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్‌‌ను ఆయన ప్రారంభించారు. చెరువుల అభివృద్ధిలో ప్రభుత్వం  ముదిరాజ్‌‌లకు ప్రాధాన్యమిస్తోందన్నారు.