సిరిసిల్లలో మంత్రుల పర్యటనను సక్సెస్‌‌ చేయాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌

సిరిసిల్లలో మంత్రుల పర్యటనను సక్సెస్‌‌ చేయాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్లలో శుక్రవారం రాష్ట్ర మంత్రుల పర్యటనను సక్సెస్‌‌ చేయాలని విప్‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌ కోరారు. జిల్లా ఇన్‌‌చార్జి, ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్.. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ శివారులోని అపెరల్ పార్క్​లో టెక్స్ పోర్ట్ యూనిట్‌‌ ప్రారంభిస్తారన్నారు.

గురువారం ఆయన అపెరల్ పార్క్​ను సందర్శించి మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే, లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌రెడ్డి ఉన్నారు. 

సన్నబియ్యం పంపిణీలో బీజేపీది రాజకీయమే 

చందుర్తి/వేములవాడ రూరల్‌‌, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో డీసీఎంఎస్, ప్యాక్స్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు.

దీనిపై కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కొందు ఫ్లెక్సీలు కట్టి తామే పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అంతకుముందు వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణంలో పాల్గొని పూజలు చేశారు.