![బీజేపీలోకి మిథున్ రెడ్డి... వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం... ఆదినారాయణ రెడ్డి..](https://static.v6velugu.com/uploads/2024/06/mla-adinarayana-reddy-comments-on-mithun-reddy-and-ysrcp-mps_T8N7XjJEgZ.jpg)
ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో బీజేపీ నేత, సీనియర్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలంతా బీజేపీలో చేరటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. స్వయంగా ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయమని అన్నారు ఆదినారాయణ రెడ్డి.
బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా ఎంపీలు అందరు బీజేపీలో చేరతారని అన్నారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అసలే 11సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన బాధలో ఉన్న వైసీపీ శ్రేణులను ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.