నేరడిగొండ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని పట్ పటీ తాండలో రూ.70 లక్షలతో చేపట్టనున్న కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. నియోగకవర్గంలోని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తానని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, విద్య, వైద్యం అందించే ప్రయత్నం చేస్తానన్నారు.
మండలంలోని కొరటికల్ గ్రామంలో భీమన్న దేవుడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చిన అశోక్ అవస్తిని అభినందించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ క్యాలెండర్ను ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. మండల మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, కన్వీనర్ అల్లూరి శివా రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, సురేందర్ పాల్గొన్నారు.