
నేరడిగొండ, వెలుగు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో అకాల వర్షంతో దెబ్బతిన్న జొన్న పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన జొన్న పంటలు చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు.
సంబంధిత ఆఫీసర్లను పిలిచి, పంట నష్టాన్ని తేల్చాలని, డాటా తనకు అందించాలన్నారు. కుమారి నుంచి గాజిలి గ్రామానికి రూ.2.19 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, మాజీ జడ్పీటీసీ డా.జహీర్, నేరడిగొండ వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఛలో వరంగల్ సభను సక్సెస్ చేయండి
బోథ్: ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నియోజకవర్గ కార్యకర్తలతో రివ్యూ నిర్వహించారు. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం 130 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బర్త్ డేను పురస్కరించుకొని గిఫ్ట్ ఎ స్మైల్‌లో భాగంగా దివ్యాంగులకు స్కూటీలు అందజేశారు.