నేరడిగొండ, వెలుగు : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని.. సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామంలో రూ.88 లక్షలతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, విద్య, వైద్యం అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, అధికారులు, ప్రజా ప్రతినిధులు
బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని అనిల్ జాదవ్ నివాసంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. జూనియర్ కాలేజీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను లెక్చరర్లు సన్మానించారు. గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి
జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనిల్ జాదవ్‌తో కలిసి ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 1986-–87 లో పదో తరగతి చదివిన నాటి స్నేహితులు ఆదివారం నేరడిగొండలోని అనిల్ఇంట్లో ఆయనను కలిశారు. శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.