గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా : అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు : నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని ఈస్పూర్ లో ఆదివారం ఆయన పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫోన్ ద్వారా ఆఫీసర్లను  సంప్రదించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. గతంలో వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జి, రోడ్లను పరిశీలించి ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత రిపేర్లు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ రమేశ్, గంగా సింగ్ తదితరులు పాల్గొన్నారు.