నేరడిగొండ , వెలుగు : పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఉచిత గాలికుంటు టీకా శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, పశువైద్యాధికారి రామారావు, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, డాక్టర్ జహీర్ తదితరులు పాల్గొన్నారు.