సీఎల్పీ సమావేశానికి డాక్యుమెంట్లతో వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి!

సీఎల్పీ సమావేశానికి డాక్యుమెంట్లతో వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి!
  • మీటింగ్ కు తీన్మార్ మల్లన్న దూరం
  • పలువురు పార్టీ మారిన ఎమ్మెల్సీలు హాజరు

హైదారాబాద్: గత వారం కొందరు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ సమావేశానికి కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. పదే పదే ఓ మంత్రి అంశాన్ని ప్రస్తావిస్తున్న ఆయన సీఎం రేవంత్, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షికి పలు డాక్యుమెంట్లు అందిస్తారని తెలుస్తోంది.

ఈ సమావేశానికి పార్టీ మారిన పలువురు ఎమ్మెల్సీలు హాజరవగా.. కొందరు  రాలేదు. నిన్న పీసీసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా సమావేశానికి రాలేదు.