నవాబుపేట, వెలుగు: రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్యెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని కొల్లూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, రుద్రారం గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ బిల్డింగ్‌ను, తుక్యా తండాలో ఆంజనేయ స్వామి ఆలయ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి లక్షలాది మంది రైతులను రుణ విముక్తి చేసిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ, వీలైనంత త్వరంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. నీరటి రామచంద్రయ్య, తులసీరాం నాయక్, బంగ్ల రవి, వెంకటేశ్ గౌడ్, హమీద్హేక్, కృష్ణారెడ్డి, నీలియా నాయక్, హరలింగం, జమీరుద్దీన్, కొనింటి బాలయ్య, శ్రీను, నర్సింలు పాల్గొన్నారు.