స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌స్కిల్‌‌‌‌కు ఎమ్మెల్యే అనుమాండ్ల యశస్వినిరెడ్డి భూమిపూజ

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో నిర్మిస్తున్న స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌, అనాథ ఆశ్రమానికి సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే అనుమాండ్ల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి ఝాన్సీరెడ్డి దంపతులు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జాటోతు రామచంద్రునాయక్, బీర్ల అయిలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి, మురళీనాయక్, నాగరాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఝాన్సీ రాజేందర్‌‌‌‌రెడ్డి కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌, స్కూళ్లకు బిల్డింగ్‌‌‌‌లు కట్టించడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సేవా కార్యక్రమాలు తోడైతే ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యులను ఈ ప్రాంత ప్రజలు మర్చిపోరన్నారు. అనంతరం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ సేవలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.

ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగానే స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేశామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజలను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో జనగాం, వరంగల్‌‌‌‌ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ రాజయ్య, నాయకులు హరిప్రసాద్‌‌‌‌రావు, సోమేశ్వర్‌‌‌‌రావు, పెదగాని సోమయ్య, సోమ రాజశేఖర్‌‌‌‌ పాల్గొన్నారు.