కొండాపూర్ లో హైటెన్షన్ : కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ.. అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య వివాదం ఇప్పుడు మాటలు దాటి ఇళ్ల దగ్గరకు చేరింది. గాంధీ ఇంటికి వస్తానన్న కౌశిక్ రెడ్డి రాకపోవటంతో.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీనే.. స్వయంగా ర్యాలీగా బయలుదేరి.. హైదరాబాద్ సిటీ కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లారు.. కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాల బయటే.. ఎమ్మెల్యే గాంధీని అడ్డుకున్నారు పోలీసులు.

Also Read :- నిన్ను వదిలేదే లేదు.. నువ్వో నేనో తేలిపోవాలి

కౌశిక్ రెడ్డికి చీర, జాకెట్ ఇవ్వటానికే వచ్చామని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇచ్చి వెళతామంటూ కౌశిక్ రెడ్డి అనుచరులు బైఠాయించారు. అనుచరులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ కూడా కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ఇంట్లోకి వెళ్లి తీరాల్సిందే అని గాంధీ పట్టుబడుతుండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.