పాడి కౌశిక్ రెడ్డిని వదిలేది లేదని.. నువ్వో నేనో తేలిపోవాలంటూ సవాల్ చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. తన ఇంటికి వస్తానన్నా కౌశిక్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ.. కూకట్ పల్లిలోని తన ఇంటి ఎదుట కుర్చీ వేసుకుని కూర్చున్నారు గాంధీ. కౌశిక్ రెడ్డి చెప్పిన మధ్యాహ్నం 12 గంటల టైం తర్వాత.. నేనే అతని ఇంటికి వెళతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు గాంధీ.
Also Read :- కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికొస్తా
కౌశిక్ రెడ్డి ఏమైనా పుడింగా అంటూ ప్రశ్నిస్తూనే.. అలాంటి వాళ్ల వల్లే బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందంటూ చెప్పుకొచ్చారాయన. కౌశిక్ రెడ్డి వైఖరి.. అతని తప్పుడు పనులను కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు గాంధీ. కౌశిక్ రెడ్డి అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని.. వాడు ఓ బ్రోకర్, వెధవ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీ.
కౌశిక్ రెడ్డిని వదిలేది లేదని.. నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు గాంధీ. కౌశిక్ రెడ్డి వచ్చి.. మా ఇంటిపై జెండా ఎగురవేయటం కాదు.. నేనే కౌశిక్ ఇంటికి వెళతా అంటూ తేల్చిచెప్పారు గాంధీ.