నేనేమైనా చేతగాని వాడినా.. కౌశిక్ నోరు అదుపులో పెట్టుకోవాలి : అరికెపూడి వార్నింగ్

నేనేమైనా చేతగాని వాడినా.. కౌశిక్ నోరు అదుపులో పెట్టుకోవాలి : అరికెపూడి వార్నింగ్

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి.. తరిమి కొడతా అంటే ఊరుకోవడానికి తానేమి చేతగాని వాడిని కాదని ఎమ్మల్యే అరికపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు ఉన్నా.. నిన్న మొన్న వచ్చిన కౌశిక్ రెడ్డి దుర్భాషలాడుతున్నాడని ఫైర్ అయ్యారు గాంధీ. కౌశిక్ రెడ్డి నా ఇంటికి వస్తా అంటే ఆయన ఏమైనా రౌడీనా అని గాంధీ ఎద్దేశా చేశారు. 

ALSO READ | 14 ఏళ్ల ఉద్యమంలో కూడా ఇలాంటి అణిచివేత చూడలేదు : ఎమ్మెల్యే హరీష్ రావు

కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ ఎమ్మెల్యే గాంధీ ఇలా ఇన్నారు.. ‘నీ కంటే ముందు నాకు పార్టీలో పరిచయాలు ఉన్నాయ్. నాతో మంచిగా మాట్లాడేవాళ్ళు ఆ పార్టీలో లేరా? బీఆర్ఎస్ లో కౌశిక్ కు ఉన్న పదవి ఏంటి? ఆ పార్టీని కౌశిక్ బ్రష్టుపట్టిస్తున్నాడు. మహిళలను, రాష్ట్ర గవర్నర్ ను అవమానకర రీతిలో మాట్లాడాడు. పదేళ్లలో కేసిఆర్ గారు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు కంట్రోల్ చేశారు. ఆంధ్రోళ్ల పవర్, తెలంగాణోళ్లు పవర్ అంటూ కౌశిక్ రెచ్చగొడుతున్నాడు. నేను మాట్లాడిన బాషా తప్పే.. కానీ, నీ రెచ్చగొట్టే భాషకు నేను స్పందించాల్సి వచ్చింది. నేను పదేళ్లుగా క్రమశిక్షణగా ఉన్నా.. నువు తరిమి కొడతా అంటే చాతకానివాడు ఎవడు లేడు’ అని నోరు అదుపులో పెట్టకోవాలని గాంధీ.. కౌశిక్ రెడ్డికి సూచించారు.