దమ్ముంటే బయటకు రా.. నేనిక్కడే ఉంటా : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

దమ్ముంటే బయటకు రా.. నేనిక్కడే ఉంటా : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

దమ్ముంటే ఎమ్మెల్యే  కౌశిక్  రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రావాలని  సవాల్ చేశారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. బయటకు  వచ్చే వరకు తానిక్కడే ఉంటానన్నారు.  కౌశిక్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.  నా ఇంటికి కౌశిక్ రెడ్డి రాలేకపోయాడు...నాకు దమ్ముంది కాబట్టి..నేను అతని ఇంటికి వచ్చా అని అన్నారు గాంధీ . కౌశిక్ రెడ్డికి దమ్మూధైర్యం లేదు. పిరికోడు..  నేను పోలీసులతో రాలేదు..నువ్వే పోలీసులను అడ్డు పెట్టుకున్నావ్. కౌశిక్ రెడ్డి పెద్ద బ్రోకర్.. ఒక కోవర్ట్. కౌశిక్ రెడ్డి దొంగ అని కేసీఆర్ గ్రహించలేకపోయారని విమర్శించారు గాంధీ.

Also Read :- పోటాపోటీగా రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు 

భారీ కాన్వాయ్ తో  కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు  ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కాంగ్రెస్  కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు బద్దలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కోడిగుడ్లు, టమోటాలతో కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. . దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కుర్చీలతో కొట్టుకున్నారు. రణరంగంగా మారింది. కౌశిక్ రెడ్డి బయటకు రావాలంటూ కాంగ్రెస్ కార్యర్తలు ఇంటి ముందు బైఠాయించారు.