కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికొస్తా : అరికెపూడి సవాల్

హైదరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. చీడపురుగు.. గతంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చే క్రమంలో బాత్రూం నుంచి బీఆర్ ఎస్ నాయకులకు ఫోన్లు చేసి..బ్రోకరిజం చేసి న బ్రోకర్ కౌశిక్ రెడ్డి అని అరికెపూడి గాంధీ మండిపడ్డారు. 

Also Read :- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి vs అరికెపూడి గాంధీ

పదేళ్లేగా నీతిగా రాజకీయం చేస్తున్నాను.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అప్పుడు..ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పాడు అరికె పూడి గాంధీ. బీఆర్ ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లను.. ఆ పార్టీలో అందరూ బ్రోకర్లే ఉన్నారు..బ్రోకర్లతో సంసారం ఎలా చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అరికెపూడి గాంధీ.  నువ్వు మా ఇంటికి రాకపోతే..నేనే నీ ఇంటికి వస్తా అంటూ కౌశిక్ రెడ్డికి సవాల్ చేశారు ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం అని సవాల్ చేశారు గాంధీ.