శేరిలింగంపల్లి ఎమ్మెల్యే , PAC చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 11న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి... అరికెపూడి గాంధీ ఇంటికొచ్చి BRS కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అరెకపూడి ఇంట్లోనే BRS కండువా కప్పి...ఇంటి ముందే పార్టీ జెండా ఎగరేస్తానంటూ సవాల్ చేశారు. దీంతో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు MLA కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని చెప్పారు అరికెపూడి గాంధీ . సెప్టెంబర్ 12న 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి మా ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు అరికెపూడి గాంధీ . నా ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్ము ఏందో నా దమ్ము ఏందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికెపూడి గాంధీ .
Also Read :- వియత్నాంలో తుపాను..155 మంది మృతి
ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఏ క్షణమైన కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.