హసన్‌పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధిలోని అనంతసాగర్, మడిపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు, యువతకు స్పోర్ట్స్ కిట్లు, అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వాటర్ బాటిళ్లు, టిఫిన్‌బాక్స్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకే స్పోర్ట్స్ కిట్లు అందజేస్తున్నామన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బండ అమిత, చిర్ర సుమలత, ఎంపీపీ కేతపాక సునీత, జడ్పీటీసీ రేణుకుంట్ల సునీత, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ అంచూరి విజయ్ పాల్గొన్నారు.