
పర్వతగిరి/వర్ధన్నపేట, వెలుగు : అభివృద్ధిలో తెలంగాణలోని గ్రామాలు దేశానికే రోల్ మోడల్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిగ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.
దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు అన్నారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, మాజీ జడ్పీటీసీ రాములు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో సంతోశ్ కుమార్, సొసైటీ చైర్మన్లు మనోజ్, దేవేందర్, మార్కెట్ డైరెక్టర్లు ఏకాంతం, రతన్‌రావు, సర్పంచ్‌లు యశోధ, గణేశ్, సంతోష్, దేవేందర్‌పాల్గొన్నారు.
అలాగే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరిశీలించారు. మంత్రి కేటీఆర్ త్వరలో పర్యటనకు రానున్నందున పనులను త్వరగా పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.