రైతుబంధు ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు: ఆరూరి రమేష్

తాము చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేత ఠాక్రే రైతుబంధు ఇవ్వొద్దని సీఈసీకి లేఖ రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. 

Also Read : రైతు బంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర: మంత్రి కేటీఆర్

వరంగల్ జిల్లా బట్టుపల్లి వద్ద రేపు(అక్టోబర్ 27) జరగబోయే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లు పరిశీలించారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఆరూరి రమేష్ కోరారు.