నిజామాబాద్ జిల్లాలోని సాయినగర్ లో భూవివాదం తలెత్తింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అల్లుడు సంపత్, నిజామాబాద్ మేయర్ భర్త దండు శేఖర్ కి మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో సంపత్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమి తమదంటే తమదంటూ గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెపారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డి అల్లుడు సంపత్.... మేయర్ భర్త శేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై హత్యయత్నం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు శేఖర్ పై కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తల కోసం..