బీఆర్​ఎస్​ పాలనలో అన్నివర్గాల అభివృద్ధి

మోపాల్, వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే బాజిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల గౌడ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి మద్దతు తెలిపారు. బాజిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కల్లుగీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఇదే సమయంలో కల్తీ కల్లు నివారణకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో ఈతవనాలు పెంచి, కార్మికులకు అండగా నిలిచామన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నరసా గౌడ్, పరశురాం గౌడ్, రాజా గౌడ్, మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు.