కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు లేదని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. సోమవారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీడర్లు మాట్లాడుతూ... చెన్నూరులో ఉప ఎన్నికలు వస్తాయంటూ బాల్క సుమన్ మతిభ్రమంచి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వందల కోట్ల రూపాయల ఫండ్స్ ను తీసుకువస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండటంతో ఓర్వలేక తమ రాజకీయ మనుగడ కోసం సుమన్, బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
తనపై పోటీ చేయాలని సుమన్ విసిరిన సవాల్‌కు చెన్నూరు ప్రజలే ఎన్నికల్లో ఆయనకు గట్టి బుద్ధి చెప్పి, అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే వివేక్ వెంకటస్వామికి పట్టం కట్టారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గం అన్ని విధాల నష్టపోయిందని, ఎక్కడ కూడా అభివృద్ధి జరుగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సుమన్ ఇసుక దందా పేరుతో వందల కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాతో సంబంధంలేదని సుమన్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సిగ్గుచేటన్నారు. యాబై ఏళ్లుగా కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రజలకు సేవలు చేస్తుందని న్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిష్కారిస్తున్నారని చెప్పారు. అధికారంలో ఉన్న , ప్రతిపక్షంలో ఉన్నప్పటికి విశాక ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న కాకా కుటుంబంపై బాల్క సుమన్ ఆరోపణలు చేస్తూ ఊరుకోమన్నారు. సమావేశంలో లీడర్లు సట్ల సంతోశ్, మంద తిరుమల్, నామని ముత్తయ్య, బండి శంకర్, గుడ్ల శ్రీనివాస్, బేర వేణుగోపాల్, జమాల్పురి నర్సోజి, రాచర్ల గణేశ్, రాయబారపు కిరణ్, నీరటి వెంకటేశ్, చిపకుర్తి వశీధర్, ఆడేపు వేణు, బత్తుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.