హైదరాబాద్, వెలుగు: లగచర్లలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆరే దాడి చేయించాడని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. కొడంగల్‌లో గిరిజనులు, లంబాడాలకు మేలు జరగకూడదని బీఆర్ఎస్ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. గురువారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్స్వయంగా బీఆర్ఎస్ నేతలకు భరోసా ఇవ్వడం వల్లే కలెక్టర్‌పై దాడి జరిగిందని, లంబాడాలు ఎప్పటికీ కేటీఆర్‌ను క్షమించర న్నారు. ఖమ్మంలో లంబాడాలైన మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్దని గుర్తుచేశారు. టెర్రరిస్టుల కన్నా దారుణంగా లంబాడాలపై గత ప్రభుత్వం దమనకాండ సాగించిందని ఫైర్ అయ్యారు.