దేవరకొండ( కొండమల్లేపల్లి, పీఏపల్లి, చింతపల్లి), వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి, పీఏపల్లి మండల కేంద్రాల్లో రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసిందన్నారు.
రాబోయే రోజుల్లో అరులైన ప్రతిఒక్కరికీ తెల్లరేషన్ కార్డులు అందజేస్తామన్నారు. అంతకుముందు గురుపౌర్ణమి సందర్భంగా చింతపల్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ కో–ఆర్డినేటర్స్ ఎంఏ సిరాజ్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ నరసింహ, పీఏసీఎస్చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు రేఖాశ్రీధర్ రెడ్డి, భవానీపవన్ కుమార్, మాధవరెడ్డి, యుగేందర్ రెడ్డి, మండలాధ్యక్షులు వేమన్ రెడ్డి, నాగభూషణం, ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.