పోలీసులు పేదలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే బాలూనాయక్ 

పోలీసులు పేదలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం  : ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ(చందంపేట), వెలుగు : పోలీసులు పేదలకు ఉచిత వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు.  శనివారం చందంపేట మండలం పోలేపల్లిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నార్కల్​పల్లి కామినేని ఆస్పత్రి వైద్య బృందంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనికతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సమాజ సేవలో పోలీసులు ముందుండడం గొప్ప విషయమన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.