- ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, చింతపల్లి, వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మంచినీటి పైప్ లైన్, డిండి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ప్రారంభించారు.
వావిల్ కోల్ గ్రామంలో నిర్మించనున్న పల్లె దవాఖాన పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులు ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా సహాయకుల శిక్షణ, ఎంకేఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పదో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం చింతపల్లి మండలం పరిధిలోని కుర్మేడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ డివిజన్ సాయి క్రీడా వేడుకల్లో పాల్గొన్నారు.
జీకేఆర్ ఇండస్ట్రీస్ నూతనంగా ఏర్పాటు చేసిన గోదాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నల్గొండ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఎ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు జానీయాదవ్, రేఖాశ్రీధర్ రెడ్డి, భవానీపవన్ కుమార్, యుగేంధర్ రెడ్డి, సురేశ్ గౌడ్, మండల అధ్యక్షుడు వేమన్ రెడ్డి పాల్గొన్నారు.