జైవీర్ రెడ్డికి సీఎం క్లాస్ పీకితే అందరూ సెట్టయిండ్రు: ఎమ్మెల్యే బాలూ నాయక్

 జైవీర్ రెడ్డికి సీఎం క్లాస్ పీకితే అందరూ సెట్టయిండ్రు: ఎమ్మెల్యే బాలూ నాయక్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగడానికి అవకాశం ఉందని, అదృష్టం ఉంటే మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందా? రాదా? అనేది చె ప్పలేనన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

 'విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందని ఎవరైనా ఊహించారా? నేను కష్టపడి పనిచేసి ఇక్కడివరకు వచ్చాను.నా దగ్గర డబ్బు లేదు. లాబీయింగ్ చేయరాదు. నేను దేవున్ని నమ్ముకుంటా' అన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి సీఎం రేవంత్ క్లాస్ పీకడంతో పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలంతా జాగ్రత్తపడ్డారని చెప్పారు. జానారెడ్డి కొడుక్కే క్లాస్ పీకితే ఇక తమ పరిస్థితి ఏంటని అందరూ యాక్టివ్ అయ్యారన్నారు.

ALSO READ | మాకూ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..లేకుంటే ప్రజాపాలన ఎలా అవుతది.?: మల్ రెడ్డి రంగారెడ్డి

ఇటీవల సీఎల్పీ మీటింగ్ లో మాట్లాడుతుండగా.. జైవీర్ రెడ్డి బయటకు వెళ్ళడంతో సీఎం రేవంత్  క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే  ఇవాళ ఎమ్మెల్యే బాలూ నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు.