ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే బాలూనాయక్  

  • ఎమ్మెల్యే బాలూనాయక్  

దేవరకొండ, వెలుగు : గ్రామాల్లో ప్రతిరోజూ విధిగా పారిశుధ్య పనులు చేపట్టాలని ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులకు సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లి, చందంపేట మండలాల్లో మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు ద్వారా నీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని చెప్పారు.

ఇటీవల కురుస్తోన్న వర్షాలతో దోమలు, సీజనల్‌‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలో ఈనెల 24న నిర్వహించనున్న గంగాసమేత కేదారేశ్వరస్వామి ఆలయం, కృష్ణానది హారతికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఆయా కార్యక్రమాల్లో యుగేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ భవానీపవన్ కుమార్, నాయిని మాధవరెడ్డి, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.