దేవరకొండ, చందంపేట, కొండమల్లేపల్లి, వెలుగు : ఆయిల్పామ్సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బాలూనాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్ పామ్ ఒకసారి సాగు చేస్తే 25 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ కల్పిస్తుందని తెలిపారు. సదస్సులో మున్సిపల్ చైర్మన్ నర్సింహా, మాజీ ఎంపీపీ జానీయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.