![నేటి తరానికి అంబేద్కర్ ఆదర్శం : బాలూనాయక్](https://static.v6velugu.com/uploads/2025/02/mla-balunayak-unveils-dr-br-ambedkar-statue-emphasizes-importance-of-his-ideals_pB9jYdtr3e.jpg)
- ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ(చందంపేట), వెలుగు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. శుక్రవారం చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం అంబేద్కర్ చేసిన కృషి, త్యాగం మరువలేనిదన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని సమసమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు.
కార్యక్రమంలో పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్లు దూదిపాల వేణుధర్ రెడ్డి, కొండ్ర శ్రీశైలం, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్యగౌడ్, మాజీ జడ్పీటీసీ బుజ్జి లచ్చిరాంనాయక్, మాజీ ఎంపీపీలు బిక్కునాయక్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కిన్నెర హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.