చదువుతో పాటు టెక్నాలజీపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

చదువుతో పాటు టెక్నాలజీపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

గద్వాల, వెలుగు: స్టూడెంట్స్ చదువుతో పాటు టెక్నాలజీ పై దృష్టి పెట్టాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంఏఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ  డిగ్రీ కాలేజీలో రోబోటిక్ అకాడమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్లు  సంయుక్తంగా రోబోటిక్  పై వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ..  నేడు రోబోటిక్ విధానం మనిషి  జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

 దేశ విదేశాలలో కొన్ని హాస్పిటల్స్ లో రోబోటిక్ వైద్యం కూడా వచ్చిందన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు సాగాలని సూచించారు. రోబోటిక్ అకాడమీ రిసోర్స్ పర్సన్స్ రమ్య, జాహ్నవి రోబోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఉపయోగాలను వివరించారు. ఈ వర్క్ షాప్ లో 12 మంది స్టూడెంట్స్ ఒక టీం గా ఏర్పడి వారికి అవేర్నెస్ కల్పిస్తారన్నారు.   గవర్నమెంట్ స్కూల్లోని స్టూడెంట్ లకు రోబోటిక్ లపై వివరిస్తారని తెలిపారు.  కార్యక్రమంలో ప్రిన్సిపల్ మీనాక్షి  పాల్గొన్నారు.