క్రీడలపై యువత దృష్టి సారించాలి  : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : క్రీడలపై యువత దృష్టి సారించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్వీఆర్ ఫౌండేషన్ సభ్యుడు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఎన్వీఆర్(నూకల వేణుగోపాల్ రెడ్డి) క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అంతకుముందు క్రీడాకారులకు టీషర్ట్స్ పంపిణీ చేశారు.