- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంచుదామని, అందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. మంగళవారం మున్సిపాలిటీలోని అన్ని విభాగాల సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపాలిటీ ఉద్యోగుల, శానిటేషన్ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటీలో గతంలో జరిగిన తప్పిదాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ స్టాఫ్ లీడర్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. రానున్న బతుకమ్మ వేడుకలకు పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ యూసూఫ్, తహసీల్దార్ హరిబాబు పాల్గొన్నారు.