మిర్యాలగూడ, వెలుగు : డంపింగ్ యార్డ్ వాహన డ్రైవర్లు నిజాయితీగా పనిచేయాలని, నాయకుల కోసం కాకుండా.. ప్రజల కోసం శ్రమించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని డంపింగ్ యార్డ్ వాహనాల రిజిస్టర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో చెత్తను సేకరించే వాహనాల రీడింగ్ లో అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
కొన్ని వార్డులకు చెత్త వాహనాలు రావట్లేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. డంపింగ్ యార్డ్ రిజిస్టర్ రీడింగ్ లో అక్రమాలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. నిత్యం వాహనాల రీడింగ్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.