వ్యవసాయానికి  24 గంటలు విద్యుత్ సరఫరా : బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : వ్యవసాయానికి 24  గంటలపాటు  ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  మిర్యాలగూడ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని

 అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం గూడూరు సమీపంలోని కీర్తి రైస్ మిల్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.