మిర్యాలగూడ, వెలుగు : గ్రామ పాలన వ్యవస్థను పటిష్టం చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పొదిల శ్రీనివాస్, తలకొప్పుల సైదులు, దేవేందర్ రెడ్డి, సుధాకర్, నరేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.