అధిష్టానం నిర్ణయం మేరకే చేరికలు : బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీలో చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ సహా కౌన్సిలర్లు వారి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షీకి అందజేశారని చెప్పారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ వర్గం స్థానిక నేతలను సంప్రదించకుండానే పార్టీలో చేరగా, పార్టీ పెద్దల సమక్షంలో చర్చలు జరిపి గురువారం కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, తమ్మడబోయిన అర్జున్, మైబెల్లి,  సలీం, పొదిల  వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.