మిర్యాలగూడలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు :  నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆర్ బ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరా సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఆఫీసర్లపై వేటు తప్పదని హెచ్చరించారు. దామరచర్ల మండలంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ ఆర్ ఫండ్స్ అందించాలని ఇండియన్,  అంబుజా సిమెంట్ యాజమాన్యాన్ని కోరారు. అనంతరం వాడపల్లిలోని మిషన్ భగీరథ ప్లాంట్ ను పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు.