- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : ఆటో డ్రైవర్లకు ఫ్రీగా లైసెన్సులను, యూనిఫామ్స్ అందిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో రవాణా, పొలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి, భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలని కోరారు. ఆటోలతోపాటు ఇతర వాహనాలను నడిపే ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ క్షేమంగా గమ్యానికి చేరాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, తహసీల్దార్హరిబాబు, డీటీసీ వాణి, ఎంవీఐలు వీరస్వామి, కొండయ్య, లావణ్య, టూ టౌన్, రూరల్ సీఐ నాగార్జున, ఎస్ఐలు చల్లా శ్రీనివాస్ యాదవ్, పిల్లి లోకేశ్, రాంబాబు, కృష్ణయ్య, హరిబాబు, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.