- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. 'మన ఊరు.. మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాడుగులపల్లి మండలంలోని 13 గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలు, నాయకులతో సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని వర్గాలు తనను భారీ మెజార్టీతో గెలిపించి గొప్ప బాధ్యతను అప్పగించారన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడుకుంటూ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అనంతరం ఆరు గ్యారంటీల పథకాల పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.