క్రీడల్లో రాణిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపు : బీర్ల అయిలయ్య

క్రీడల్లో రాణిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపు : బీర్ల అయిలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : క్రీడల్లో రాణించడం వల్ల ప్రపంచస్థాయి గుర్తింపుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. 

క్రీడలు శారీరక ధృడత్వం పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట టౌన్, రూరల్, ఎస్పీఎఫ్, ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, యాదగిరిగుట్ట ఆలయ అర్చక సిబ్బందితో క్రికెట్ మ్యాచులను విజయవంతంగా నిర్వహించిన ట్రాఫిక్ సీఐ కృష్ణను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి

డీసీసీ చీఫ్ అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఆలేరు మాజీ ఎంపీపీ అశోక్, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లేపల్లి శ్రీశైలం, కేసరి యూత్ అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ కుమార్, సీఐలు రమేష్, కొండల్ రావు, కృష్ణ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఎస్పీఎఫ్ హోంగార్డులు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.