భూ భారతితో సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

భూ భారతితో సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త చట్టం భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆత్మకూరు(ఎం)లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, అటువంటివి తలెత్తకూడదనే ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు. భూ సమస్యలు మార్పులు చేర్పులు, మ్యుటేషన్, ఇతర సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. 

ఈ చట్టం రైతులకే మాత్రమే కాదని, ఆఫీసర్లకు కూడా ధైర్యం ఇచ్చిందన్నారు. సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగు అంచెల్లో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టంపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముందుగా అంబేద్కర్​ ఫొటోకు పూలమాల వేసి జ్యోతి వెలిగించారు. సదస్సులో కలెక్టర్​ హనుమంతరావు, అడిషనల్​ కలెక్టర్​వీరారెడ్డి, డీసీసీబీ చైర్మన్​ కుంభం శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి ఉన్నారు.
 
భూ భారతి చట్టం రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పు..

దేవరకొండ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పు సృష్టిస్తుందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. చింతపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ మండల కేంద్రాల్లో నిర్వహించిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు మేలు జరిగే విధంగా భూ భారతి చట్టాన్ని రూపకల్పన చేశారాని తెలిపారు. సదస్సులో కలెక్టర్ ఇలా త్రిపాటి, జేసీ శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

భూ భారతితో రైతుల కష్టాలకు చెక్..

గరిడేపల్లి/నేరేడుచర్ల, వెలుగు : భూ భారతి పోర్టల్ తో రైతుల కష్టాలకు చెక్ పడనుందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రం, నేరేడుచర్లలో భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ భూ భారతిపై రెవెన్యూ సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. భూ భారతి చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు పెట్టినట్లు వివరించారు. దస్సులో ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్, తహసీల్దార్లు కవిత, నాగార్జునరెడ్డి, సైదులు, కమలాకర్, మంగ, జ్యోతి, సురేందర్ రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.