వడగళ్ల బాధిత రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

వడగళ్ల బాధిత రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
  • ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ధర్పల్లి, వెలుగు: వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి, ఆదుకుంటామని నిజామాబాద్​రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం ధర్పల్లి మండలంలోని ఒన్నాజీపేట్, వాడి, ధర్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతులు తమ శ్రమ నేలపాలైందని బోరుమన్నారు. సర్వే నిర్వహించామని, 174 మంది రైతులకు సంబంధించి 274 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.  

జిన్న రాజమణి అనే మహిళా రైతు మాట్లాడుతూ.. సారూ.. మాకు ఉన్నది ఒక్కటే ఎకరం.. పంట చేతికొస్తుందని సంతోషిస్తే వర్షంతో నేలపాలైందని కంటతడి పెట్టింది.  ఎమ్మెల్యే ఆమెను ఓదార్చారు. కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నబాల్​రాజ్, సింగిల్ విండో ఛైర్మన్​మల్లికార్జున్, నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నర్సయ్య, పుప్పాల సుభాష్, చెలిమెల శ్రీనివాస్, ఒన్నాజీపేట్​మాజీ సర్పంచ్​లు భగవంత్​రెడ్డి, బేల్దారీ కృష్ణ,  గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

పరిహారం వచ్చేలా చూస్తా..

సిరికొండ, వెలుగు: వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు పరిహారం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. కొండూర్, చిన్నవాల్గోట్, మైలారం, చిమన్​పల్లి గ్రామాల్లో పంటలను ఆదివారం పరిశీలించారు. తడిసిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బీజేపీకి 8 మంది ఎంపీలు,8 మంది ఎమ్మెల్యేలున్నారని, కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​జిల్లా కార్యదర్శి భాస్కర్​రెడ్డి, మండల అధ్యక్షుడు బాకారం రవి, సొసైటీ ఛైర్మన్​ గంగాధర్, నాయకులున్నారు.