తెలంగాణ సొమ్మును కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంది :   రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

తెలంగాణ సొమ్మును కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంది :   రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ధర్పల్లి, వెలుగు:  తెలంగాణ సొమ్మును కేసీఆర్​కుటుంబం దోచుకుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధర్పల్లి మండలకేంద్రంలో పద్మశాలీ  సంఘం ఆధ్వర్యంలో శనివారం మార్కండేయ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ పేరుతో అప్పులు చేశారని, తమ​ ప్రభుత్వం అప్పులకు 6500 కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. సంక్షేమ ఫథకాలు అమలు చేసేందుకు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నబాల్​రాజ్​, మిట్టాపల్లి గంగారెడ్డి, విండో చైర్మన్​ చెలిమెల చిన్నారెడ్డి(ధర్పల్లి) పుప్పాల సుభాష్​, గాదరి మనోహర్​రెడ్డి, మునిపల్లి సాయరెడ్డి, చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.