నల్లగుట్ట ఆలయం అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నల్లగుట్ట ఆలయం అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 ధర్పల్లి, వెలుగు:  ధర్పల్లి పెద్దమ్మ ఆలయం, దుబ్బాకలోని నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు.  ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం, నర్సింహస్వామి ఆలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  కాంగ్రెస్​ ప్రజాపాలన, సంక్షేమంపై దృష్టి పెట్టిందన్నారు.  

ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఇందిరమ్మ పాలనలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే పుట్టిన రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  కేక్​లు కట్​ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నబాల్​రాజ్​, ఐడీసీఎంఎస్​ తారాచంద్​ నాయక్​,  పుప్పాలసుభాష్​, మిట్టాపల్లి గంగారెడ్డి, గాదరి మనోహర్​రెడ్డి, విండో చైర్మన్లు​ చెలిమెల చిన్నారెడ్డి(ధర్పల్లి), రాజేందర్​రెడ్డి (ఒన్నాజీపేట్)​, చెలిమెల శ్రీనివాస్​, చెలిమెల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.