మిషన్​ భగీరథతో ..24గంటలు నీళ్లిస్తున్నం

నిజామాబాద్ సిటీ, వెలుగు:నగర ప్రజలకు 24 గంటల పాటు మంచినీరు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఆదివారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.నిజామాబాద్ నగరంలో ఎన్నడూ లేని విధంగా 9 ఏళ్లలోఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. నగర మేయర్ నీతు కిరణ్, ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు రాజు, హేమలత పాల్గొన్నారు.

కామారెడ్డి: మిషన్​ భగీరథ ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని విప్​ గంప గోవర్ధన్​ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సదాశివ్​నగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద నీటి పండుగ నిర్వహించారు. గోవర్ధన్ ​మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక ముందు ఏ ఊరికి వెళ్లినా.. నీటి ఎద్దడి తీర్చాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేసేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు. ఎమ్మెల్యేలు హన్మంత్​ షిండే, జాజుల సురేందర్, కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

వర్ని: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం  చందూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వాటర్‌‌ దినోత్సవంలో స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. మిషన్​ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటినందిస్తున్నామన్నారు. ప్రోగ్రామ్​లో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆర్మూర్​:మిషన్ భగీరథ లాంటి సక్సెస్ ఫుల్ పథకం ప్రపంచంలో ఎక్కడా లేదనని ఆర్మూర్​ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జక్రాన్​పల్లి మండలం అర్గుల్ శివారులో మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద జరిగిన ప్రోగ్రామ్​లో పాల్గొని మాట్లాడారు.

పిట్లం: ఇంటింటికీ తాగునీరందించి, సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందని ఎమ్మెల్యే హన్మంత్​షిండే అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మద్నూర్ ​మండలం శేఖాపూర్​లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హన్మంత్​షిండే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మద్నూర్ ​ఎంపీపీ లక్ష్మీబాయి పాల్గొన్నారు.