ఓయూ,వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కురుమ విద్యార్థి సంఘం నేతలు కోరారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సంఘం నేతలు డాక్టర్ కంకల ఎలేందర్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న గొల్ల కురుమలకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలని, బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కురుమ విద్యార్థి సంఘం నేతలు బర్ల మహేందర్, కుమారస్వామి, బీసీ జాక్, ఓయూ జాక్ నేతలు పాల్గొన్నారు.